హాయ్ ఈ రోజు నేను మీతో ఆసక్తి మరియు చాలా సరదాగా ఉన్న కథలను మీతో పంచుకుంటాను. 
ఈ కథలకు ఒక కథలో చాలా నీతులు ఉన్నాయి

కథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హృదయాలలో మంచి నడవడి ని గురించి,
 ధర్మా ధర్మాల గురించి, చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు.

పిల్లలికి కథలంటే ఎంతో ఇష్టం. కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. 
విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోయే అవకాశం 

1. నాలుగు ఆవులు

ఎక్కువే.

ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.
కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.
ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.
నీతి: ఐకమత్యమే బలం.